»Kiran Kumar Reddys Sensational Comments On Tammudu
Vijayawada : తమ్ముడు పై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (United Andhra Pradesh) చివరి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా సోదరుడు టీడీపీ(TDP)లో చేరిన తరువాత ఇంటికి కూడా వెళ్లలేదని. గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను ఆయన అన్నారు. మాది ఉమ్మడి కుటుంబం అని తమ్ముడు నిర్ణయాలు ఆయన వ్యక్తిగతం. నా నిర్ణయాలపై ఎవరి ప్రభావం లేదు. బీజేపీ (BJP) అధిష్టానం నిర్ణయమే, తన నిర్ణయమని కిరణ్ కుమార్ వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (United Andhra Pradesh) చివరి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా సోదరుడు టీడీపీ(TDP)లో చేరిన తరువాత ఇంటికి కూడా వెళ్లలేదని. గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను ఆయన అన్నారు. మాది ఉమ్మడి కుటుంబం అని తమ్ముడు నిర్ణయాలు ఆయన వ్యక్తిగతం. నా నిర్ణయాలపై ఎవరి ప్రభావం లేదు. బీజేపీ (BJP) అధిష్టానం నిర్ణయమే, తన నిర్ణయమని కిరణ్ కుమార్ వెల్లడించారు. బీజేపీలో చేరిన అనంతరం ఢిల్లీ (Delhi) నుంచి ఏపీకి వచ్చారు ఆయన. విజయవాడలో మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ రాష్ట్ర నేతలు ముందుకు తీసుకెళ్తామన్నారు. బీజేపీ కార్యకర్తలా పార్టీ బలోపేతం కోసం పాటుపడతానన్నారు .ఏపీ విభజన జరగక ముందే ప్రత్యేక హోదా(special status) అనే దానిపై కమిటీలు వేశారు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. తాను కేవలం బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం ఆశించి మాత్రమే పార్టీలో చేరానని, పదవులు ఆశించి కాదన్నారు.
బీజేపీ నుంచి ఓ ముఖ్య నేత తనను సంప్రదించారని, ఆ తర్వాత బీజేపీలో చేరానని తెలిపారు. ఎయిరిండియా(Air India) తరహాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) విషయంలోనూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సెంటిమెంట్ ఉంది కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. కానీ లాభాల్లోకి రావాలి. బిడ్డింగ్ వేస్తే ఎవరైనా ఆసక్తి చూపిస్తారని అన్నారు.ఇంకో విషయం ఉందని, కానీ అది తెలంగాణకు సంబంధించిన అంశమన్నారు. తాను హైదరాబాద్ (Hyderabad) లోనే పుట్టి, అక్కడే పెరిగి, హెచ్పీఎస్, నిజాం కాలేజీ(Nizam College)ల్లో చదువుకున్నానని, సొంత ఊరు ఏపీలోని చిత్తూరు (Chittoor) అన్నారు. తనకు బెంగళూరు(Bangalore)లో కూడా ఇల్లు ఉందని అన్నారు. అలాంటప్పుడు పార్టీ అవసరాన్ని బట్టి, ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తానని చెప్పారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వం ఆశించి పార్టీలో చేరానన్నారు. పార్టీ తనకు అప్పగించే బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తిస్తాను. పనులు చేస్తూ పోతే పదవులు అవే వస్తాయన్నారు కిరణ్ కుమార్ రెడ్డి .