టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ టీమిండియాతో కలిసి సందడి చేశారు. భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే 18వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం క్రికెటర్లు నగరానికి వచ్చారు. ఎన్టీఆర్ ఇటీవలె ఆర్ఆర్ఆర్ మూవీకి గాను గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అందుకొని, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఉమ్మడి మిత్రుడి ద్వారా క్రికెటర్లు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నారని తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్-క్రికెటర్లు కలిసి ఫోటోలు దిగారు. ఇవి నెట్టింట వైరల్ అయ్యాయి. శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహల్, ఇషాన్ కిషన్, తదితరులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు దిగారు. ఎక్కడ కలిశారన్నది తెలియరాలేదు. ఎన్టీఆర్ గత డిసెంబర్ నెలలో తన సతీమణి ప్రణతితో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. ఆర్ఆర్ఆర్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించిన సమయంలో మూవీ టీమ్, రామ్ చరణ్‌తో పాటు అమెరికాలో కలిసి సందడి చేశారు.