Pawan Kalyan: జనసేత అధిపతి పవన్ కళ్యాణ్ సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో తన భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు. లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ దగ్గరున్న పోలింగ్ కేంద్రంలో వారిరువురు ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ పోలింగ్ కేంద్రం వద్దకు రావడంతో అక్కడ ఓట్లు వేయడానికి వచ్చిన వారంతా ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. అభిమానులు హడావిడితో అక్కడ తోపులాట జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితిని చక్కదిద్దడానికి సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. పవన్ ఓటు వేసి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అక్కడ పరిస్థితి చక్కబడింది.
ఓటు హక్కును వినియోగించుకున్న మరి కొందరు ప్రముఖులు : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు చోట్లు నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నటుడు చిరంజీవి, తన కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు. అలాగే సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఓటేశారు. రాజమండ్రిలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.