Elections 2024 : అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నాలుగో విడత పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విడతలో పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 96 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. రికార్డు స్థాయిలో అంతా పోలింగ్ బూత్‌లకు హాజరు కావాలని మోదీ పిలుపునిచ్చారు.
ఈ విషయమై ప్రధాని( తన ఎక్స్ అధికారిక ఖాతాలో తెలుగులోనూ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు జరిగే నాలుగో దశ లోక్ సభ ఎన్నికల్లో పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఓటింగ్ పెరుగుదలకు యువ ఓటర్లు, మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను. రండి. మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ అంటూ ఓటర్లందరికీ ప్రోత్సాహకరంగా ఉండే ట్వీట్ చేశారు.
ఈ రోజు జరిగే నాలుగవ దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి…