»It Department Has Given Show Cause Notices To Chandrababu In 118 Crore Scam
Chandrababu: రూ.118 కోట్ల స్కాం..చంద్రబాబుకు నోటీసులు
బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థలను సృష్టించి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఇన్ఫ్రా సంస్థల ద్వారా దాదాపు రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై బాబు అభ్యంతరాలను తిరస్కరిస్తూ తాజా నోటీసుల్లో స్పష్టం చేసింది.
IT department has given show cause notices to Chandrababu in 118 crore scam.
Chandrababu: టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల రూపంలో రూ.118 కోట్ల ముడుపులు అందుకున్నారని ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఆదాయ పన్ను శాఖ షోకాజ్(Show Cause notice) నోటీసులు ఇచ్చింది. వీటిపై చంద్రబాబు తెలిపిన అభ్యంతరాలను ఐటీ శాఖ(IT) తిరస్కరించింది. మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి) ఒప్పుకున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు ముడుపులు డెలివరీ చేసినట్లు షాపూర్ జీ పల్లోంజి మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారు. అందుకే తాజా నోటీసుల్లో ఇన్ఫ్రా కంపెనీల ద్వారా అందుకున్న రూ.118 కోట్లను బ్లాక్ మనీగా ఎందుకు పరిగణించరాదో తెలపాలని బాబును ఐటీ శాఖ కోరింది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఈ ముడుపుల బాగోతం నడిచిందని ఐటీ శాఖ స్పష్టం చేసింది.