»Opposition Alliance India Reached Mumbai Mamata Banerjee Insulted Marathi People
INDIA: మా సంస్కృతిని అవమానించారంటూ దీదీపై కామెంట్స్..ముంబై చేరుకున్న కూటమి
కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమి ఇండియా మూడో సమావేశం కోసం కీలక నేతలు ముంబై చేరుకున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వ్యూహ రచనతో పాటు అనే రాజకీయ విషయాలపై చర్చ జరగనుంది. అయితే సీఎం మమతా బెనర్జీ బొట్టును నిరాకరించడంతో మరాఠీలు హర్ట్ అయ్యి కామెంట్లు చేస్తున్నారు.
Opposition alliance India reached Mumbai. Mamata Banerjee insulted Marathi people
INDIA: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai) వేదికగా ఇండియా కూటమి మూడవ సమావేశం జరగనుంది. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. 28 ప్రతిపక్ష పార్టీలకు చెందిన సుమారు 63 మంది ప్రతినిధులు హజరు కానున్నారు. ఈ మీటింగ్‌లో మొదటి రోజు రాబోవు ఎన్నికల ప్లాన్ గురించి, మూకుమ్మడిగా ఎన్టీయే(NDA) ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ప్రణాళికలపై చర్చించనున్నారు. తరువాత ఈ మహాకూటమికి చెందిన లోగో(Logo) ఆవిష్కరణ, 11 మందితో కూడిన సమన్వయ కమిటీని ప్రకటించడం అలాగే కన్వీనర్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక సీట్ల పంపకంపై సెప్టెంబర్ 30న నిర్ణయం తీసుకుంటామని పార్టీలు తెలిపాయి.
రాష్ట్రాల స్థాయిలో సీట్ల సర్దుబాటు ఎలా జరగాలనే దానిపైనా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఒడిశా(Oddisha), తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AndraPradesh) మినహా దేశ వ్యాప్తంగా 450 పార్లమెంటు స్థానాల్లో కూటమి తరఫున ఒకే అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నారు. ముంబైలో జరగబోయే మీటింగ్‌కు కాంగ్రెస్ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ఓ చిన్న వివాదంలో చిక్కుకున్నారు. కాంగ్రెస్(Congress) ఇండియా కూటమి సమావేశం కోసం ముంబై చేరుకున్న దీదీ మమతా బెనర్జీ(Mamata Banerjee)కి ఘన స్వాగతం పలికారు అక్కడి మరాఠీ మహిళలు. అయితే దీదీకి స్వాగతం పలికే క్రమంలో వారి సాంప్రదాయంలో బొట్టు పెట్టబోతుంటే ఆమె వద్దన్నారు. దీంతో వారి మరాఠీ సంస్కృతి అవమానించారంటూ స్థానికులు కామెంట్లు చేస్తున్నారు. బెంగాలి బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన సీఎం మమతా ఎందుకు తిలకం తిలకం పెట్టుకోలేదని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.