Durga Temple: దుర్గగుడి పాలకమండలిలో కీలక నిర్ణయాలు
దుర్గాఘాట్(Durga Ghaat) నుంచి గిరి ప్రదక్షణ మార్గంలో దేవస్ధానం బస్సు నడపాలని, దేవస్ధానంలో అమ్మవారి సేవ చేసుకునే ఉచిత ప్రసాదం అందజేయాలని అధికారులు నిర్ణయించారు. అమ్మవారి దర్శన సమయంలో వృద్ధులకు, వికలాంగులకు మరిన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
విజయవాడ కనక దుర్గగుడి(Vijayawada Kanaka Durga Temple) పాలకమండలి సమావేశాన్ని ఆలయాధికారులు సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలకమండలి నిర్ణయాలను దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలియజేశారు. దుర్గాఘాట్ లో స్నానాలు ఆచరించే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పాలక మండలి తీర్మానించింది. భక్తుల సౌకర్యార్థం ప్రొవిజన్స్ స్టోరేజ్ కోసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
దుర్గాఘాట్(Durga Ghaat) నుంచి గిరి ప్రదక్షణ మార్గంలో దేవస్ధానం బస్సు నడపాలని, దేవస్ధానంలో అమ్మవారి సేవ చేసుకునే ఉచిత ప్రసాదం అందజేయాలని అధికారులు నిర్ణయించారు. అమ్మవారి దర్శన సమయంలో వృద్ధులకు, వికలాంగులకు మరిన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కొండ దిగువున ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయాల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాంబాబు ప్రకటించారు.
పాలక మండలి సమావేశం తర్వాత కర్నాటి రాంబాబు మాట్లాడుతూ.. గతంలో అప్పటి పాలకుల సమయంలో ధనికుడైతేనే అమ్మవారి చెంత డైరెక్టర్ గా అవకాశం కల్పించే వారని, కానీ జగన్ ప్రభుత్వంలో మాత్రం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు డైరెక్టర్లుగా అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రతిరోజు 3వేల నుంచి 4వేల మందికి అన్నదానం చేయనున్నట్లు వెల్లడించారు. శని, ఆదివారాల్లో 5వేల మందికి అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. రూ.500 టిక్కెట్ తగ్గింపుపై ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.