»If Kiran Kumar Reddy Had Done That The State Would Not Have Been Divided Vijayasai Reddy
Vijayasai Reddy: కిరణ్ కుమార్ రెడ్డి ఆ పనిచేసి ఉంటే.. రాష్ట్ర విభజన అయ్యేది కాదు
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై విజయ్ సాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆరోజు రాష్ట్రాన్ని విడగొట్టింది వీళ్లేనని విమర్శించారు.
If Kiran Kumar Reddy had done that.. the state would not have been divided.. Vijayasai Reddy
Vijayasai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై విజయ్ సాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ నైతిక విలువలను మరిచిపోయిన రాష్ట్రాన్ని విడగొట్టారని విమర్శించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరులో ప్రచారం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన అయ్యేదే కాదని పేర్కొన్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రం చీలడానికి ముఖ్య కారణం అన్నారు.
ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో చేతులు కలిపాడు. ప్యాకేజులు మాట్లాడుకొని రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని దుయ్యబట్టారు. ఇప్పుడు అవేవి పట్టనట్లు నటిస్తున్నారని ఎద్దేవ చేశారు. అలాంటి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు ఇప్పుడు బీజేపీతో కూటమి పెట్టుకొని రాష్ట్రాన్ని ఏం చేద్దామని అని ప్రశ్నించారు. వారి మాటలు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మడం లేదని, వారు చేసిన పనులు ఎవరు మరిచిపోలేదని వెల్లడించారు. మళ్లీ రాష్ట్రంలో వైసీపీ విజయం సాధిస్తుందని నెల్లూరు నగరంలోని ఎనిమిదో డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు.