mla vamsi followers:గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (vamsi) అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. కార్యాలయ ఆవరణలో ఉన్న కారుకు నిప్పు అంటాంచారు. ఆఫీసులో సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు (chandra babu), ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌పై (lokesh) వంశీ (vamsi) విమర్శించారు. దీనిపై టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. తమ నేతను విమర్శిస్తారా? అంటూ వంశీ అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి దాడి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో టీడీపీ కార్యదర్శి దొంతు చిన్నా ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. సాయంత్రం పార్టీ కార్యాలయం లక్ష్యంగా దాడి చేశారు.
పార్టీ కార్యాలయంపై దాడితో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదనపు పోలీసు (police) బలగాలను మొహరించారు. టీడీపీ ఆఫీసుపై దాడిని టీడీపీ నేత బుద్దా వెంకన్న తప్పుటప్టారు. వంశీకి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కార్యాలయంపై దాడి చేయడం సరికాదన్నారు. దొంగదెబ్బ తీయడం కాదు.. విజయవాడ సెంటర్లో (vijayawada centre) ఫేస్ టు ఫేస్ తేల్చుకోవడానికి సిద్దంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. వంశీ (vamsi), కొడాలి నాని (kodali nani) టీడీపీ నుంచి ఎందుకు బయటకు వెళ్లిపోయారో అందరికీ తెలుసు అని చెప్పారు. ఈ రోజు వైసీపీ నేతల పతనం మొదలైందని చెప్పారు. టీడీపీ నేతల సహనాన్ని పరీక్షించొద్దని హితవు పలికారు.
గత ఎన్నికలో వంశీ టీడీపీ నుంచి గెలిచారు. వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే పదవీకి రాజీనామా చేసి.. రావాలని సీఎం జగన్ కండీషన్ పెట్టారు. దీంతో ఆయన వైసీపీలో చేరిక ఆలస్యం అవుతూ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీలో చేరిక తథ్యం అని అనుకుంటున్నారు. అందుకే చంద్రబాబు, లోకేశ్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, వంశీ, వంగవీటి రాధా మంచి స్నేహితులు.