»Former Mla Nanjappa Son Committed To Suicide Attempt While Assets Disputes
Punganur ఆస్తి కోసం ఆత్మహత్యకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు
పెదనాన్న వెంకటరత్నం మా నాన్న శంకరప్పకు రావాల్సిన భాగం ఇవ్వడం లేదు. పెద్ద మనషుల పంచాయితీల్లో తీర్మానించాం. అయినా కూడా మాకు ఆస్తిలో భాగంగా ఇవ్వకుండా పెద్దనాన్న వేధిస్తున్నాడు.
అది మాజీ ఎమ్మెల్యే (Former MLA) కుటుంబం.. దివంగత నాయకుడికి ఇద్దరు కుమారులు. ఆస్తిపాస్తులు (Assets) బాగానే ఉన్నాయి. కానీ ఆయన మృతి చెందాక అందరి ఇళ్లల్లో మాదిరి వీరి ఇంటిలో కూడా ఆస్తి కోసం గొడవలు (Property Disputes) మొదలయ్యాయి. అన్నదమ్ముల మధ్య తీవ్ర వివాదం ఏర్పడి తమ్ముడు ఆత్మహత్య యత్నానికి పాల్పడే దాకా చేరింది. వీరి ఆస్తి పంచాయితీ కుటుంబసభ్యులు తేల్చకపోవడంతో పోలీస్ స్టేషన్ కు చేరింది. ఈ సంఘటన ఏపీలోని పుంగనూరులో (Punganur) చోటుచేసుకుంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నంజప్ప (Nanjappa) 1962లో పలమనేరు (Palamaneru) ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు వెంకటరత్నం, శంకరప్ప, కుమార్తె పార్వతమ్మ ఉన్నారు. నంజప్ప మృతితో కుటుంబంలో ఆస్తి కోసం గొడవలు మొదలయ్యాయి. ముత్తకూరు వద్ద తండ్రి సంపాదించిన 60 ఎకరాలు, పుంగనూరులో ఇళ్లు, స్థలాల్లో పెద్ద కుమారుడు వెంకటరత్నం తన వద్దే ఉంచుకున్నాడు. వాటిలో వాటా (Quota) ఇవ్వాలని తమ్ముడు శంకరప్ప కోరితే ససేమిరా అంటున్నాడు. దీనిపై ఏళ్లుగా గొడవలు (Clashes) జరుగుతూనే ఉన్నాయి.
ఇక ఆస్తి తనకు దక్కదనే ఆందోళనతో.. తాను చనిపోతే అయినా తన బిడ్డలకు ఆస్తి దక్కుతుందనే ఉద్దేశంతో సోమవారం శంకరప్ప ఆత్మహత్య (Suicide) చేసుకునేందుకు ప్రయత్నించాడు. పుంగనూరులోని తూర్పుమొగశాల ప్రాంతంలో ఉన్న ఇంట్లో పెట్రోల్ (Petrol) పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. కుటుంబసభ్యులు అడ్డగించారు. ఈ సంఘటనతో వీరి ఆస్తి పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది.
‘పెద్దపంజాణి మండలం ముత్తుకూరు, పుంగనూరు పరిసరాల్లో భూములు ఉన్నాయి. అందులో పెదనాన్న వెంకటరత్నం మా నాన్న శంకరప్పకు రావాల్సిన భాగం ఇవ్వడం లేదు. పెద్ద మనషుల పంచాయితీల్లో తీర్మానించాం. అయినా కూడా మాకు ఆస్తిలో భాగంగా ఇవ్వకుండా పెద్దనాన్న వేధిస్తున్నాడు. అందుకే మా నాన్న ఆత్మహత్యకు యత్నించాడు’ అని శంకరప్ప కుమారుడు నంజప్ప మీడియాకు తెలిపాడు. పోలీసులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరాడు.