GNTR: ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. విభజిత గుంటూరు జిల్లాలో 150 పరీక్షా కేంద్రాల్లో 30,140మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్ పరీక్షలతోపాటు, మరో 21 పరీక్షా కేంద్రాల్లో దూర విద్యపరీక్షలు కూడా నిర్వహించనున్నారు. కాగా, గుంటూరు గతేడాది 88.14శాతంతో 16వ స్థానంలో నిలిచింది.