సత్యసాయి: లేపాక్షి నవోదయ విద్యాలయంలో 9, 10వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం అక్టోబర్ 7వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ నాగరాజు తెలిపారు. అర్హులైన విద్యార్థులు అదే రోజు సాయంత్రం 5 గంటలలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచిస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.