ATP: గుత్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈనెల 12న సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ బుధవారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 12న శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని కావున సర్పంచులు, ఎంపీటీసీలు,తమ సమస్యలను ఈ సభ దృష్టిలో తీసుకురావాలని సూచించారు. అధికారులు, సిబ్బంది తప్పక హాజరు కావాలన్నారు.