ASR: మహిళా, శిశు సంక్షేమ శాఖ శిశు గృహలో ఖాళీగా ఉన్న మేనేజర్, ఆయా పోస్టులకు మంగళవారం పాడేరులో ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా సెలక్షన్ కమిటీ సభ్యులు ఆర్డీవో లోకేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీ పడాల్ తదితర అధికారులు, ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మేనేజర్ పోస్టు(1)కు ముగ్గురు, ఆయా పోస్టులు(3)కు 12 మంది అభ్యర్థులు హాజరయ్యారు.