అన్నమయ్య: సుండు పల్లె మండలం ఆరోగ్యపురం బడికిలో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, ఎస్సై శ్రీనివాసులు, ఎక్సైజ్ అధికారులతో కలిసి దాడి చేసి 10 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.