ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా అక్రమ బాణసంచా నిల్వలకై పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎవరైనా అనుమతులు లేకుండా బాణసంచా తయారీ, నిల్వ చేస్తున్నారనే కోణంలో పోలీసుల తనిఖీలు చేశారు. తనిఖీలపై ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపుల యజమానులు తప్పక నిబంధనలు అనుసరించాలన్నారు.