KDP: కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై వల్లూరు మండలం పాపాగ్నినగర్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో వాహనదారుడికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.