W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువులో జాతీయ పల్స్ పోలియో ముగింపు దశలో భాగంగా ఇవాళ ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మీ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రతి ఇంటిని తనిఖీ చేసి, ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కలు వేశారో లేదో ఆరా తీశారు. చుక్కలు వేయని పిల్లలను గుర్తించి మార్కింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.