కోనసీమ: కంటి సమస్యల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి వాటిని సంరక్షించుకోవాలని పలువురు వక్తలు సూచించారు. ఆలమూరు మండలం పెదపళ్లలో శనివారం కపిలేశ్వరపురం ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 206 మందికి ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు నిరంజన్ కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు అందజేశారు.