E.G: చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసినట్లు నిడదవోలు పీవీజీ తిలక్ తెలిపారు. శనివారం నిడదవోలు పోలీస్ స్టేషన్ వద్ద సీఐ మాట్లాడుతూ.. నిందితుడి వద్ద 223 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులు, రూ.లక్ష నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని సీఐ వెల్లడించారు.