WG: పీఎం స్వనిధి, వీవర్స్ ముద్ర, ఎన్హెచ్సీ గ్రూపులకు బ్యాంకర్లు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకర్లు, అధికారులతో ఆమె సమీక్షించారు. పీఎం స్వనిధి కింద నిధులు విడుదలలో కొన్ని బ్యాంకులు తాత్సారం చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, వేగవంతంగా రుణాలు అందించాలన్నారు.