W.G: భీమవరంలోని డీఎన్ఆర్ కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు, జీఎస్టీపై చర్చ జరిగింది. దేశాభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, అవసరమైన చోట జీఎస్టీని తగ్గించారన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొన్నారు.