కోనసీమ: కోనసీమ మండల కేంద్రంలో కపిలేశ్వరపురంలో తుఫాన్ కారణంగా విద్యుత్తుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాటర్ ట్యాంకులు, తాగునీరు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. పూర్తిస్థాయిలో పనిచేయని ఒక జనరేటర్‌ను తీసుకువచ్చి పంచాయతీ అధికారులు కాలయాపన చేస్తున్నారు.