KDP: కొండాపురంలోని లావనూరు రహదారిలో మంగళవారం రాత్రి కారు, బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన శివకుమార్, రామాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. వారు దుగ్గుపల్లి నుంచి కొండాపురం వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.