ATP: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం రాత్రి రాష్ట్ర స్థాయి “స్వచ్ఛాంధ్ర అవార్డులు – 2025” కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా అనంతపురం జిల్లా తరఫున కలెక్టర్ ఓ. ఆనంద్ స్వచ్ఛ జిల్లా అవార్డు – 2025ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్వీకరించారు. జిల్లాలో పరిశుభ్రతపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు.