NTR: విస్సన్నపేట మండలలోని రాజీవ్ నగర్ కాలనీలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. నిన్న కుక్కల దాడిలో ఆరుగురు పెద్దలు, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినా, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.