ATP: ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలకు ఈ క్రాప్ నమోదు చేయించడానికి ఈనెల 25వ తేదీవరకు గడువును పెంచినట్లు ఏవో అన్వేష్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. శింగనమల మండల వ్యాప్తంగా ఖరీఫ్ పంటలు సాగు చేసిన రైతులు గడువు తీరేలోగా వ్యవసాయ అధికారుల చేత పంటలకు ఈ క్రాప్ నమోదు చేయించాలని సూచించారు.