ప్రకాశం: తుఫాన్ ప్రభావంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కనిగిరి మండలంలోని పలు గ్రామాలలో పంట నీట మునిగాయి. శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ప్రధానంగా సజ్జ, పొగాకు, మిరప, బొబ్బర, మినుము, మొక్క జొన్న రైతులు తీవ్రంగా నష్టం వాటిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.