NLR: రాపూరు మండలంలోని కండలేరు జలాశయంలో బుధవారం ఉదయం 6 గంటలకు 82.590 మీటర్ల నీటిమట్టానికి 56.656 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ మేరకు అధికారులు తాజా బులెటిన్ విడుదల చేశారు. సత్య సాయి గంగ కాలువకు 850, మొదటి బ్రాంచ్ కాలువకు 70, లోలెవెల్ స్లూయిజ్కు 10 క్యూసెక్కుల సాగునీరు విడుదల అవుతోందని ఏఈ తిరుమలయ్య తెలిపారు.