ATP: మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నియమితులైన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మండల నాయకుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. క్రమశిక్షణ, ఐక్యతతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.