ప్రకాశం జిల్లాలో గంజాయి నిర్వీర్యం చేసేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. మంగళవారం ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 6 గంజాయి కేసులలో 25 మంది వద్ద 9.87 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. రైళ్లలో తనిఖీలు నిర్వహించి 12 మందిని అరెస్టు చేసి 72 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.