VSP: విశాఖ నగరంలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి గుట్టురట్టు చేశారు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నోట్లతో సంచరిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.