WG: ఆకివీడులో మంగళవారం రాత్రి నుంచి పోలీస్ పికెట్ కొనసాగుతోంది. సంత మార్కెట్ ప్రాంతంలో 8 ఏళ్ల బాలికపై మీరావలి(70) అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై హనుమంత నాగరాజు పర్యవేక్షణలో ఆకివీడు పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. మంగళవారం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.