PLD: కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో శనివారం హుండీ లెక్కింపు జరిగింది. 102 రోజులకు గాను మొత్తం రూ. 59,97,254 ఆదాయం వచ్చింది. దీంతో పాటు 51 గ్రాముల బంగారం, 330 గ్రాముల వెండి లభించాయి. హుండీ లెక్కింపును సహాయ కమిషనర్ చంద్రశేఖర్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు.