గుంటూరు బ్రాడీపేట సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో శతవసంతాల కమ్యూనిస్టు ఉద్యమంలో విరబూసిన ఎర్రమందారాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కామ్రేడ్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరై, భారత కమ్యూనిస్టు ఉద్యమం శతవసంతాల స్ఫూర్తిని, త్యాగ సాహసాలను స్మరించారు.