Ex minister Avanthi Srinivas Audio call goes Viral
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆడియో లీకులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఓ మంత్రి ఆడియో లీకు బయటకు రాగా…. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరిట మరో ఆడియో లీకు బయటకు రావడం గమనార్హం. గతంలో మంత్రిగా ఓ మహిళతో అయన మాట్లాడిన సంభాషణ వైరల్ అయింది. ఐ లవ్యూ బంగారం అంటూ ఆయన మాట్లాడిన మాటలు… అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఆయన వయసేంటి.. ఇంత లేటు వయసులో ఇలాంటి కాల్స్ ఏంటీ అని పలువురు విమర్శిస్తున్నారు.
అవంతి శ్రీనివాస్ .. గతంలో తన ఆడియో.. తనది కాదని చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆ విషయాన్ని రూఢీ చేయాలనే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వం కూడా తమ మంత్రిపై అంత సీరియస్ ఆరోపణలు వచ్చినా లైట్ తీసుకుంది. విచారణ జరిపితే అసలు విషయం బయటకు వస్తుందని.. లైట్ తీసుకున్నారని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి ఆడియోనే బయటకు వచ్చింది.
ఈ ఆడియో ఫేక్ అని అవంతి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తన కీర్తి, ప్రతిష్టలను దెబ్బతీసేందుకు కుట్రలో భాగంగానే ఇలాంటివి సృష్టిస్తున్నారని చెప్పారు. తాను 15 రోజులుగా అయ్యప్ప మాలలో ఉన్నానని.. పది రోజుల క్రితమే ఈ ఆడియో విషయం తన దృష్టికి వచ్చిందని వివరించారు. పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశానని.. దర్యాప్తు కొనసాగుతోందని అవంతి వివరించారు.