కోనసీమ: మండపేట నియోజకవర్గం రాయవరంలో ఇటీవల సంభవించిన బాణాసంచా ప్రేలుడు సంఘటన తెలిసిందే. అయితే మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నష్టపరిహారాన్ని ఒక్కో బాధిత కుటుంబానికి రూ.15 లక్షలు చొప్పున చెక్కులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు.