ELR: కామవరపుకోట మండలం కళ్లచెరువు వద్ద గుండేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు వాగు ఉంటూ రక్షణ చర్యలు కొనసాగిస్తున్నారు. కళ్లచెరువు, రంగాపురం మధ్య రాకపోకలను నిషేధించారు. వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని, కాల్వలు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయవద్దని ఎస్సై చెన్నారావు హెచ్చరించారు.