శ్రీకాకుళం: తుఫాన్ వలన నష్టపోయిన పంటలకు ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం అందించాలని AP రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. మోహనరావు, మండల అధ్యక్ష కార్యదర్శులు కే. బాలాజీ రావు టీ. భాస్కరరావు డిమాండ్ చేశారు. గురువారం వజ్రపుకొత్తూరు మండలం, సీతాపురం బెండి గల్లి, శివరాంపురం, నగరంపల్లి గ్రామాలలో తుఫాన్ వలన కురిసిన వర్షాలకు నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించారు.