W.G: కాళ్ళ మండలం కాళ్లకూరులో వేంచేసి ఉన్న స్వయంభూః శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక శనివారం పురస్కరించుకుని అంగరంగ వైభవంగా అష్టోత్తర శతనామార్చన, సహస్రదీపాలంకరణ సేవ, ఉంజల్ సేవ జరిపారు. శ్రీ స్వామివారి దేవాలయం తెల్లవారుజాము నుంచి భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగించారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు.