VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి మంగళ వీధికి చెందిన ప్రసాద్, అదే ప్రాంతానికి చెందిన రవితేజ మంగళవారం తాగిన మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రసాద్‌ను వెనకనుండి చాకుతో బలంగా గాయపరిచాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి, అక్కడ నుంచి విశాఖ KGHకు తరలించారు. భార్య భారతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై బుధవారం తెలిపారు. ప్రస్తుతం ప్రసాద్ చికిత్స పొందుతున్నాడు.