ATP: గుత్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తికి ఆలయ అర్చకుడు వాసుదేవా శర్మ ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, పంచసూక్త సహిత పంచామృత అభిషేకం, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలతో బంగారు, వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు.