ఏపీ(AP)లో భూకంపం(Earthquake) సంభవించింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో భయాందోళన నెలకొంది. జిల్లాలోని ముండ్లమూరు గ్రామంలో ఆదివారం ఉదయం రెండు సెకన్ల పాటు భూప్రకంపనలు జరిగాయి. గ్రామస్తులు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఆదివారం ఉదయం రెండు సెకన్ల పాటు భూమి కంపించ(Earthquake)గా చాలా ఇళ్లల్లో ప్రకంపనలు జరిగాయి. భూమి కంపించడానికి ముందు భారీ శబ్దం(Sound) వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికే భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంపం(Earthquake) రావడంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చామని, తమకు ఏదైనా జరుగుతుందేమోనని భయం నెలకొందని వెల్లడించారు.
ఈమధ్యకాలంలో తెలుగు రాష్ట్రా(Telugu States)ల్లో వరుస భూకంపాలు(Earthquake) చోటుచేసుకుంటున్నాయి. మార్చిలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతసతో కూడా భూప్రకంపనలు జరిగాయి. గ్రామంలోని చాలా ఇళ్ల గోడలు బీటలు వారడమే కాకుండా పలు సిమెంట్ రోడ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇకపోతే ఫిబ్రవరిలో కూడా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పులిచింతల పరిసర ప్రాంతంలో కూడా భూకంపాలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో భూప్రకంపనలు జరిగాయి.