E.G: కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో రాష్ట్ర పౌర సరఫరాశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం పర్యటించారు. ఎమ్మెల్యే ముప్పిడివెంకటేశ్వరరావుతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల పొలాల వద్దకు వెళ్లి ధాన్యం సేకరణ సమయంలో పరికరాలను పనితీరును పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి సెల్ఫీ దిగారు.