KDP: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు సోమవారం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చారు. అలాగే, రాయచోటిని మదనపల్లె జిల్లాకు, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు, రాజంపేటను కడప జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరుకు మార్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.