NLR: రాపూరు సీఐగా సత్యనారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాపూరు సీఐగా పనిచేస్తున్న విజయకృష్ణ ఆకస్మికంగా వీఆర్‌కి బదిలీ అవడంతో బాపట్ల జిల్లా సీఐగా పనిచేస్తున్న సత్యనారాయణను రాపూరు సీఐగా ఉన్నతాధికారులు నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.