NLR: కావలి పట్టణంలో శనివారం జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రథానికి ప్రత్యేక పుష్పాలతో అందంగా అలంకరించారు. రథం లాగడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. పోటీపడి రథాన్ని లాగుతూ స్వామివారిని దర్శించుకున్నారు. పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, మంగళ వాయిద్యాలతో రథయాత్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.