VSP: మాకవరపాలెం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత నెల 8న తామరం వీఆర్వో లక్షణరావు భూమి మ్యుటేషన్ చేసేందుకు రూ.15,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు శనివారం సుమారు 5 గంటలపాటు తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్లో గల రికార్డులను పరిశీలించారు.