ASR: జనవరి 31 నుండి మూడు రోజులపాటు జరిపే అరకు చలి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో బాగంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో ఐటిడిఏ పీఓ అభిషేక్, జేసీ అభిషేక్ గౌడ్ స్థల పరిశీలన చేసి, ఉత్సవాల విజయవంతానికి ప్రణాళికను రూపొందించారు. దేశంలో ఉన్న గిరిజన సాంప్రదాయాలు, ఆచారాలను ఉత్సవాలలో ప్రదర్శించేలా ఏర్పాటు చేస్తున్నుట్లు వారు వెల్లడించారు.