PLD: నరసరావుపేట మండలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం 37° డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గురువారం 41 డిగ్రీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఎండలకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తీసుకోవాలన్నారు.